Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంపు బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీలో ఎస్పీ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గోదావరి వరదల సమయంలో మండల అధికారులు ముఖ్యంగా పోలీసుల పని తీరు భేష్‌గా ఉందని ఎస్పీ వినీత్ ప్రశంశించారు. దుమ్ముగూడెం పోలీస్ శాఖ మరియు నవ లిమిటెడ్ పాల్వంచ వారి సహకారంతో సోమవారం లకీëనగరం గ్రామంలో గల గిరిజన బాలికల వసతి గృహంలో ముంపు భాదిత గ్రామాలు అయినటువంటి ఎం.కాశీనగరం, సున్నంబట్టి, గంగోలు గ్రామాలతో పాటు వలస గొత్తి కోయ గిరిజన గ్రామాలు అయినటువంటి గద్దమడుగు, మానుగట్టు, ములకనాపల్లి గొత్తి కోయ గుంపు గ్రామాల ప్రజలకు ఆయన చేతుల నిత్యావసర సరుకులు అందజేసి, మాట్లాడారు. ఈ సందర్బంగా ముంపు ప్రజల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిభిరంలో సుమారు 200 వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్, సిఐ దోమల రమేష్, ఎస్సైలు రవికుమార్, కేశవ్, డిప్యూటి డిఎంఅండ్ హెచ్ఓ బాలాజీ నాయక్, వైద్యులు వసుందర, చైతన్య తదితరులు పాల్గొన్నారు.