Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రీవేన్స్ డే అని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవేన్స్ డే నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ సమస్య గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులో అధికంగా భూ వివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలు, భార్యాభర్తల సమస్యలపై వచ్చిన బాధితుల ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్వో అధికారులకు ఆదేశించారు.
సిపిని కలిసిన విశ్రాంత పోలీసు అధికారుల సంఘం
విశ్రాంత పోలీసు అధికారుల సంఘం కార్యనిర్వాహక కమిటీ బృందం ఆధ్వర్యంలో సోమవారం పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్రాంత పోలీసు అధికారుల సంఘం కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శిగా రుద్ర వెంకటనారాయణ (రిటైర్డ్ ఎస్ఐ) ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్కే పాషా (రిటైర్డ్ ఎస్సై) సంఘం అధ్యక్షుడు రాధాకృష్ణ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ని పోలీస్ కమిషనర్ కార్యాలయం కలిసి విశ్రాంతి పోలీస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ని కలసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, వెంకటనారాయణ, సంఘ నాయకులు దస్తగిరి, రంగారావు, వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.