Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీలను పెళ్లాడిన జంటలకు దళిత బంధును తక్షణమే ఇవ్వాలి
- గ్రీవెన్స్ లో కలెక్టర్ కు కెవిపిఎస్ ఆధ్వర్యంలో వినతి
నవతెలంగాణ-ఖమ్మం
చింతకాని మండలంలో దళిత బంధు అమలులో జరుగుతున్న వివక్షను అరికట్టి జాప్యం లేకుండా ఎస్సీలను పెళ్లి చేసుకొని జీవనం కొన సాగిస్తున్న కులాంతర వివాహిత జంటలకు దళిత బంధును తక్షణమే ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం గ్రీవెన్స్‌లో బాధితులతో కలిసి కలెక్టర్ వి.పి. గౌతమ్ కి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే దళిత బంధు అమలుకై పైలెట్ మండలంగా చింతకానిని ఎంపిక చేసి కొద్దిమందికి మాత్రమే దళిత బంధు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరైనదికాదని, దళితులందరికీ ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ఎస్సీలను వివాహం చేసుకున్న ప్రతి కుటుంబాన్ని గుర్తించి తక్షణమే వారికి దళిత బంధు ను ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ గౌతమ్ ఇప్పటికే 43 జంటలను గుర్తించామని వెంటనే వారికి దళిత బంధును ఇస్తామని బాధితులకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల సాగర్, బాధితులు కె. నరేష్, ఎస్.కె.మీరాసాహెబ్, కొమ్ము సురేష్, నాగులు మీరా, రాము సైదులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.