Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సకాలంలో వస్తేనే నేరస్తులకు శిక్ష
- అడిషనల్ డీసీపీ అడ్మిన్ శభరిష్
నవతెలంగాణ ఖమ్మం
పోలీసు సిబ్బంది వృత్తి పరమైన పని సామర్ధ్యాన్ని పెంపొందించేందుకై అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్స్ విధానంలో కేసుల దర్యాప్తులో మెరుగైన ఫలితాలు రావడంతో పాటు నేరస్తులకు సకాలంలో శిక్షపడుతున్నాయని అడిషనల్ డీసీపీ అడ్మిన్ శబరిష్ అన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ అమలులో తీసుకోవలసిన చర్యలపై సంబంధిత వర్టికల్స్ ఇంచార్జులతో సోమవారం పోలీస్ శిక్షణా కేంద్రంలో శిక్షణ తరగతులకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ల వారీగా పోలీసుల పనితీరుని తెలిపే సత్వర స్పందన, నేరాల నిరోధం, నేర పరిశోధన చేధింపు, త్వరితగతిన కేసుల దర్యాప్తు పూర్తిచేసి సకాలంలో కోర్టుకు సమర్పించడం, సమన్ల జారీ, వారెంట్లను అమలు చేయడం, కోర్టులలో పకడ్బందీగా సాక్ష్యాల నమోదు చేసి, నేరస్తులకు శిక్షపడేలా పనిచేయడం.. తదితర అంశాల వారీగా ఫంక్షనల్ వర్టికల్స్ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. జిల్లాలోని అత్యంత మారుమూల పోలీస్ స్టేషన్లలోని కానిస్టేబుల్ స్థాయి అధికారుల పనితీరు కూడా వీటిద్వారా మదింపు చేసి, ఉత్తమ సేవలందించే పోలీస్ అధికారులను ప్రత్యేకంగా గుర్తించి, రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందచేస్తున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా పోలీసుల పని సామర్ధ్యం పెరగడమే కాకుండా.. పౌరులకు మెరుగైన పోలీసింగ్ అందించేందుకు దోహదపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీలు రామోజీ రమేష్, బస్వారెడ్డి, వెంకటస్వామి, వర్టికల్ ఇంచార్జ్ ఏసీపీ బాబురావు, సిఐలు చిట్టిబాబు, శ్రీధర్, సర్వయ్య, రామకృష్ణ, శ్రీనివాస్, మురళీ, సతీష్, సాంబరాజు, సురేష్, ఐటి కోర్ టీమ్ ఇంచార్జ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.