Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాలు
- హాజరుకానున్న 8,152 మంది అభ్యర్థులు
- ఎస్పీ డాక్టర్ వినీత్.జి
నవతెలంగాణ-కొత్తగూడెం
ఈ నెల 7వ తేదీ ఆదివారం జరగనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు సంభందించి జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి తెలిపారు. బుధవారం కెఎస్ఎం కళాశాలలో పరీక్షా కేంద్రాల రీజనల్ కో-ఆర్డినేటర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, అబ్జర్వర్సుతో అవగాహనా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షా సమయం. ఈ రాత పరీక్షకు నోడల్ అధికారిగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు వ్యవహరిస్తారని తెలిపారు. కొత్తగూడెంలోని 14 పరీక్షా కేంద్రాలలో 6,108 మంది, భద్రాచలంలో ఏర్పాటు చేసిన 7 కేంద్రాలలో 2,044 మంది అభ్యర్థులు ఈ రాత పరీక్షకు హాజరు కానున్నారన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారానే అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించడం జరుగుతుందన్నారు. కొత్తగూడెం నందు ఏర్పాటు చేసిన 14 పరీక్షా కేంద్రాలకు మైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ పున్నం చందర్, భద్రాచలం నందు ఏర్పాటు చేసిన 7 కేంద్రాలకు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ భద్రయ్య రీజనల్ కో-ఆర్డినెటర్స్గా వ్యవహరిస్తారని తెలిపారు. 21 పరీక్షా కేంద్రాలకు 21 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ మరియు 21 మంది అబ్జర్వర్సుగా వ్యవహరిస్తారని తెలియజేసారు. ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఇంగ్లీష్ వర్షన్ నే పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ స్వామి, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.