Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులను ఆశ్రయించిన దంపతులు
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
వడ్డీ డబ్బులు ఇవ్వలేదని వృద్ధ దంపతులను గృహ నిర్బంధం చేసి దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన మండల పరిధిలోని బీరోలు గ్రామాల్లో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బీరోలు గ్రామానికి చెందిన బత్తిని శ్రీనివాస్ ఆయన భార్య రంగమ్మ 2018 సంవత్సరంలో వ్యాపారం నిమిత్తం మండల పరిధిలోని ఏలూరు వారి గూడెం గ్రామ పంచాయతీకి చెందిన నంద్యాల శ్యాంసుందర్ రెడ్డి వద్ద ఏడు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఈ క్రమంలో 2018 లో మొదటి విడతలో వచ్చిన లాక్ డౌన్ లో వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు తీర్చలేని పరిస్థితి లో శ్రీనివాస్‌కు ఉన్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మి 2019 సంవత్సరంలో ఏడు లక్షల గాను 11 లక్షల 40 వేల రూపాయలను చెల్లించగా అప్పు తీసుకున్నప్పుడు రాయించుకున్న అగ్రిమెంట్ కాగితాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. సోమవారం ఇంకా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని పాతర్ల పాడు గ్రామానికి చెందిన దళితులను తీసుకొచ్చి గహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినందుకు మంగళవారం ఉదయం ఒక ఇరవై మంది వ్యక్తిగత మనుషుల్ని తీసుకొచ్చి ఇంటి ముందు దౌర్జన్యానికి దిగారు. నంద్యాల శ్యాంసుందర్‌రెడ్డి నేను మాజీ నక్సలైట్ న ని బండబూతులు తిడుతూ చంపుతానని బెదిరిస్తున్నాడు. శ్యామ్ సుందర్ రెడ్డితో మాకు ప్రాణ హాని ఉందని బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీస్ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.