Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. రామవరంలోని మాత శిశు అసుపత్రికి కాన్పుకోసం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని గొల్లగూడెంకు చెందిన వరలక్ష్మీ రెండవ కాన్పుకోసం అసుపత్రికి వచ్చింది. మంగళవారం వచ్చిన తనకి నొప్పులు రావడంలో కాన్పుల రూములకు తీసుకు వెళ్లారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంచినప్పకి కాన్పు కాలేదు. ఎందుకు కాలేదని కుటుంబ సభ్యులు అసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. సుఖ కాన్పుచేయడానికి వేచి ఉంచామని సమాధానం తెలిపారు. కాన్పు ఇబ్బంది కరంగా ఉంటే ఆపరేషన్ చేయాలని బాధితులు కోరారు. మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. అందు నిర్లక్షంగా వ్యవహరించారని వారు అపోపిస్తున్నారు. సాయంత్రం రాత్రి 9 గంటలకు కాన్పు అయినప్పటికీ శిశువు బతకలేదని, మృత శిశువు జన్మించిందని, కేవంల డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. తరుచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని, డాక్టర్లను పెంచడంలేదని, ఉన్న వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాదితులు వాపోతున్నారు.