Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు రుణ మాఫీ చేయాలి,- వ్యవసాయ కూలీల ఆందోళన
నవతెలంగాణ-మధిర
మండలం పరిధిలో ఆత్కూరు గ్రామంలో కూలీలు ''కూలి రేట్లపెంచాలని రైతుల రుణమాఫీ'' వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కూలీలు ఆందోళన చేశారు. కూలీలు పనులకు పోకుండా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వూట్ల శంకర్రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక పరిస్థితి బాగాలేదని కూలీల పరిస్థితి అంతకంటే దయనీయంగా మారిందని నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో కూలీల పరిస్థితులు మరింత దిగజారుతున్నయి అని అన్నారు. కూలీల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ. రైతాంగం రుణమాఫీ వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా సిఐటియు జిల్లా నాయకులు శీలం నర్సింహారావు, కార్మిక సంఘ నాయకులు మహిళా సంఘం నాయకులు మండవ పన్నింద్ర కుమారి మద్దాల ప్రభాకర్ పాపినేని రామ నరసయ్య పాల్గొన్నారు.