Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర పత్రికలకు భిన్నంగా నవతెలంగాణ
నవతెలంగాణ-కొత్తగూడెం
నవతెలంగాణ పత్రికలో పనిచేస్తున్న పాత్రికేయులు వర్గ దృక్పథంతో వార్తా కథనాలు రాయాలని, ఇతర పత్రికల కంటే నవతెలంగాణ పత్రిక ప్రజా పేదల ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవతెలంగాణ పాత్రికేయులకు ఒక్క రోజు వర్క్‌షాప్ స్థానిక టీచర్స్ భవన్ యూటీఎఫ్ కార్యాలయంలో నవతెలంగాణ రీజినల్ మేనేజర్ ఎస్డి.జావీద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వెలికి తీయడంలో నవతెలంగాణ పాత్రి కేయుల బృందం కృషిని ఆయన అభినందించారు. మరింత చేయా ల్సి అవసరం ఉందన్నారు. ఇటీవల వరదల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించి, ప్రజల కష్టాలను, నష్టాలను తెలు సుకుని నవతెలంగాణ బృందం పరిశీలన వ్యాసాలను రాసిన విధానాలను అభినంది ంచారు. ముంపు ప్రజల ఇబ్బందులను ఇతర పత్రికలతో పోటి పడి ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. ఇతర పత్రికలకు దీటుగా పోటీ పడి వార్తాకథనాలు అందించాలని సూచించారు. ప్రజా పోరాటాలకు సిద్దమయ్యోలా వార్తాలుండాలని, విలువలతో కూడిన జర్నలిజాన్ని ప్రదర్శించాలన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా స్టాఫర్ శ్రీనివాసరెడ్డి, డెస్క్ ఇంచార్జ్ కె.వీరేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.