Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలు విరిగి ప్రాణాపాయం నుండి బయట పడ్డ బాలిక
నవతెలంగాణ-చండ్రుగొండ
ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురైన విద్యార్థినీ వసతి గృహంపై నుండి దూకి కాలు విరగ్గొట్టుకున్న సంఘటన మంగళవారం మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని తుంగారం గ్రామానికి చెందిన పప్పుల ప్రమీల స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో ఆరో తరగతి చదువుతుంది. ఇటీవల తల్లిదండ్రులు వసతిగృహానికి వచ్చినప్పుడు ప్రమీల తాను హాస్టల్లో ఉండనని ఇంటికి తీసుకెళ్లమని బతిమిలాడింది. కానీ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవడంతో వసతి గృహాంలో ఉండిపోయింది. మంగళవారం ఉదయం తోటి విద్యార్థులతో కేజీబీవీ బిల్డింగ్ ఎక్కి అక్కడ బట్టలు ఆరవేసుకుంటూ ఒక్కసారిగా పైనుండి కిందకు దూకింది. దీంతో తోటి విద్యార్థులు గమనించి వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించడంతో విద్యార్థినినీ హుటాహుటిన కొత్తగూ డెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ప్రమా దంలో విద్యార్థిని కాలు విరిగింది. భవనంపై నుండి కిందకు దూకిన స్థలంలో నీరు, బురద, ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని తోటి విద్యార్థులు, ఉపా ధ్యాయులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినీ కొత్తగూ డెం ఏరియా ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.