Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ధర్నా
నవతెలంగాణ- నేలకొండపల్లి
తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా, కెవిపిఎస్ తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సామాన్య ప్రజానీకం కదం తొక్కారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తొలిత స్థానిక రావెళ్ల భవనం నుండి భారీ ప్రదర్శనగా బయలుదేరి తహసిల్దార్ కార్యాలయంకు చేరుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కేవీ రామిరెడ్డి, సిఐటియు మండల కన్వీనర్ పగిడికత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలుగా అధికారం చేపట్టి 8 ఏళ్లు గడుస్తున్నా నేటికీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా రేషన్ కార్డులు, వితంతు, ఒంటరి మహిళలు, వద్ధులు, వికలాంగులకు ఆసరా పెన్షన్లు మంజూరీ కాకపోవడంతో అర్హులైన లబ్ధిదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నేటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించకపోవడంతో పాటు పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని, నిరుపేదలందరికీ ఇంటి స్థలం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాలని, స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ కొరకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన పత్రాన్ని స్థానిక తాసిల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు దుగ్గి వెంకటేశ్వర్లు, మందడపు మురళీకృష్ణ, కట్టేకోల వెంకటేశ్వర్లు, ఎరదేశి నరసింహారావు, షేక్ మజీద్, పెద్దిరాజు నరసయ్య, కూచిపూడి శ్రీదేవి, బలుసు ప్రమీల, తిరుపతిరావు, ముక్తవరపు రత్నకిషోర్, కె.వి చారి, మహిముద్, మల్లికార్జున్, చింతలపాటి భాస్కర్, మధు, చెరుకు శ్రీను, ధారావత్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : మోడీ ప్రభుత్వం వ్యవసాయ కూలీలు,రైతుల సమ స్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, వ్యవసాయ కూలీల భద్రత కోసం దేశవ్యాప్తంగా సమగ్ర చట్టాన్ని రూపొందించాలని రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం తాసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కరుణాకర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వ్యకాస అధ్యక్ష కార్యదర్శులు గామాసు జోగయ్య, నాగులవంచ వెంకట్రామయ్య, రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు గొల్లపూడి కోటేశ్వరరా వు, నల్లబోతుల హనుమంతరావు, సిఐటియు బాద్యులు సగుర్తి సంజీవరావు, నాయకులు షేక్ నాగుల్ మీరా, ఆంగోతు వెంకటేశ్వర్లు, షేక్ లాల, సుబ్బారెడ్డి, లగడపాటి అప్పారావు, మాదల వెంకట నరసయ్య, కూడెల్లి నాగేశ్వరరావు, కోలా రాములు, కృష్ణంరాజు, మోక్ష నందం, బిక్షాలు, తదితరులు పాల్గొన్నారు.