Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- కుటుంబానికి రూ. 2లక్షల పార్టీ బీమా అందజేత
నవతెలంగాణ- సత్తుపల్లి
పార్టీని నమ్ముకొని జెండా మోసిన కార్యకర్తలు దురదృష్టవశాత్తు మరణించిన నేపధ్యంలో వారి కుటుంబాలు వీధిన పడకుండా ఉండేందుకు పార్టీ తరపున చేయించే బీమా గులాబీ జెండా రూపంలో భరోసా ఇస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఇటీవల కాలంలో మండలంలోని కిష్టారం అంబేద్కర్‌నగర్‌కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బొందల శ్రీను రోడ్డు ప్రమాదంలో మరణించగా అతని పేరున మంజూరైన రూ. 2లక్షల బీమా సొమ్మును మృతుని భార్య చైతన్యకు ఎమ్మెల్యే సండ్ర మంగళవారం స్వయంగా ఇంటికి వెళ్లి అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమవతి శంకరరావు, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీటీసీ పాలకుర్తి సునీతారాజు, నాయకులు కొడిమెల అప్పారావు, జవ్వాజి అప్పారావు, ములకలపాటి విష్ణువర్దనరావు, నారుకుళ్ల శేషగిరిరావు, జేష్ట అప్పారావు, మామిళ్లపల్లి హరిబాబు, మాచినేని నరేంద్ర, మోదుగు పుల్లారావు, మారోజు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
తెలుగుజాతి ఖ్యాతిని చాటిన 'పింగళి'
స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య భారతదేశ జాతీయ పతాకాన్ని రూపొందించి తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పింగళి వెంకయ్య 146వ జయంతిని ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, కౌన్సిలర్లు చాంద్‌పాషా, అనిల్‌కుమార్, రాఘవేంద్ర, నాగుల్‌మీరా, మారుతి సూరిబాబు, నాయకులు దొడ్డాకుల గోపాలరావు, మంద పాటి రవీంద్రరెడ్డి, మల్లూరు అంకమరాజు, వల్లభనేని పవన్, వేములపల్లి మధు, వనమా వాసుదేవరావు, మోదుగు పుల్లారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వరద బాధితులకు సత్యసాయి సమితి సేవలు అభినందనీయం
సత్తుపల్లి సత్యసాయి సేవా సమితి సభ్యులు గోదావరి వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందించి ఆదుకోవడం అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బూర్గంపాడు మండలం ఏలేరు, శ్రీధర గ్రామాలకు చెందిన 500 కుటుంబాలకు పంచిపెట్టనున్న రూ.4లక్షల విలువగల నిత్యావసరాల కిట్ల తరలింపు కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెండాఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు దమ్మాలపాటి సుధాకర్, సత్తుపల్లి సమితి గౌరవాధ్యక్షులు గాదె సత్యనారాయణ, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ప్రసన్న గణపతి ఛారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు కూసంపూడి శ్రీనివాసరావు, సమితి బాధ్యులు అచ్యుత్, కౌన్సిలర్ ఎస్కే చాంద్‌పాషా, వేములపల్లి మధు, మల్లూరు అంకమరాజు పాల్గొన్నారు.