Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య
నవతెలంగాణ - ఖమ్మంరూరల్
రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరిం చాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య అన్నారు. మండలంలోని తెల్దారుపల్లి గ్రామంలో మంగళవారం రజక వృత్తిదారుల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లా డుతూ రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో రజకులకు 250 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి, తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలైన నేటికి నిధులు కేటాయించక పోవడం సిగ్గుచేటు అన్నారు. స్వాతంత్రం వచ్చే 75 ఏళ్లు అవుతున్న నేటికి రజకులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర వెనకబాటులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన రజకులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వడ్డీ లేని 10 లక్షల రుణం అందించాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు నిండిన రజకులకు పెన్షన్ సౌకర్యం కల్పించా లన్నారు. మోడ్రన్ ధోబి ఘాట్లు,ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఈ నెల 16వ తేదీన మద్దులపల్లి కమ్యూనిటీ హాలులో జరిగే రజక వృత్తిదారుల సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సత్తెనపల్లి శ్రీను, దొనకొండ ముత్తయ్య, కొక్కిరేణి లెనిన్, పోతురాజు సైదులు, సిరికొండ పెద్ద అప్పారావు, కొక్కిరేణి సైదమ్మ, పోతురాజు సావిత్రి, పోతురాజు తిరపయ్య పాల్గొన్నారు.