Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
2020 సెప్టెంబర్ 19న జీవో నెంబర్ 20 ద్వారా తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఓ పోస్టులను రద్దుచేసి, 22 నెలల తర్వాత వీఆర్ఓ లను వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయాలని, ప్రభుత్వం 121 జీవో విడుదల చేసిందని, దానిలో భాగంగా కలెక్టర్ ఐటీడీఏ, గిరిజన సంక్షేమ కార్యాలయానికి వీఆర్ఓలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించుకోవడానికి కేటాయించినందున వారికి వివిధ శాఖలలో నియమించినట్టు ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్) డేవిడ్ రాజ్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో విధులలో చేరడానికి వచ్చిన జూనియర్ అసిస్టెంట్లను లాటరీ పద్ధతి ద్వారా సంబంధిత అధికారుల సమక్షంలో వారిని ఎంపిక చేసి జాయినింగ్ ఉత్తర్వులు అందజేయడం జరిగిందని తెలిపారు. గిరిజన సంక్షేమ గురుకులం పాఠశాలలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13 మందికి, ఖమ్మం జిల్లాకి 06, మందికి అలాగే డిఎం జిసిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలానికి 16 మందికి, డిడి ట్రైబల్ వెల్ఫేర్, ఐటీడీఏ కార్యాలయానికి 9 మందికి, పోస్టింగులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి భీము, డీఎం జీసీసీ వాణి, డీటీఆర్ఓఎఫ్ఆర్ శ్రీనివాస్, ఐటీడీఏ మేనేజర్ ఆదినారాయణ, గురుకులం సెల్ ఏవో నరేందర్ తదితరులు పాల్గొన్నారు.