Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ డీసీసీబీ చైర్మెన్ యలమంచి రవి కుమార్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన మారాయిగూడెం మాజీ ఉపసర్పంచ్ సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సోయం వీరస్వామి (43) గుండెపోటుతో మృతి చెందడం ప్రజా ఉద్యమాలకు, పార్టీకి తీరని లోటని మాజీ డీసీసీబీ చైర్మన్ యలమంచి రవి కుమార్ అన్నారు. మంగళవారం గుండెపోటుతో మృతి చెందిన వీరస్వామి మృతదేహాన్ని ఆయన సందర్శించి పార్టీ కండువా కప్పడంతో పాటు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరస్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ప్రజాసేవలో ఎప్పుడు వీరస్వామి ముందు భాగంలో ఉండి పోరాడే వాడన్నారు. వీరస్వామి స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సోయం వీరస్వామికి ఎర్ర జెండా కప్పి పూలమాలవేసి నివాళులు అర్పించిన వారిలో పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు సరియం కోటేశ్వరావు, మర్మం చంద్రయ్య, సరియం రాజమ్మ, మండల కార్యదర్శివర్గ సభ్యులు బోల్లి సూర్యచంద్రరావు, మండల కమిటీ సభ్యులు కోరం వీరభద్రం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సోయం జోగారావు, మాజీ సర్పంచ్ అర్జున్, ప్రసాద్, సరియం ప్రసాద్, మహిళా సంఘం మండల అధ్యక్షురాలు సోయం సుశీల, తదితరులు ఉన్నారు.