Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు
నవతెలంగాణ- చింతకాని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం నాగులవంచలో సీపీఎం చింతకాని మండల రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల్లో అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వంగా మారిందన్నారు. నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పరితపిస్తున్నారన్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు తారా స్థాయికి చేరాయని, వాటిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. అప్పుల రాష్ట్రంగా మార్చి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం నెట్టివేయ బడిందనన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలు నిర్వహించాలని, కార్యకర్తలందరూ గ్రామం యూనిట్‌గా పోరాటాలకి ప్లాన్ చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో ఉధృతమైన పోరాటాలు నిర్వహి స్తామని తెలిపారు. పార్టీ కర్తవ్యాలు అనే అంశంపై పార్టీ మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు బోధించారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకి రాములు, తోటకూరి వెంకటనర్సయ్య, మద్దిన్ని బసవయ్య, రాచబంటి రాము, కాటబత్తిన వీరబాబు, మునుకుంట్ల సుబ్బారావు, పంగా గోపయ్య, దేశబోయిన ఉపేందర్, సోషల్ మీడియా కన్వీనర్ గడ్డం విజయ్ కుమార్ పాల్గొన్నారు.