Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల పరిధిలోని ఉప్పుసాక పంచాయతీ జిన్నగట్ట గ్రామంలో తాటి స్నేహిత అనే చిన్నారి రెండు కాళ్లు అవిటి తనంతో ఉండి బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పట్టణంలో ఓ ప్రైవేట్ వైద్యశాలలో వైద్యం కోసం చేయూత ట్రస్టు ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. ఈ వైద్యం చేస్తే రెండు కాళ్లు సక్రమంగా వస్తాయని, ఈ నెల 15వ తేదీన ఆస్పత్రికి వెళ్లాల్సి ఉండగా చేతిలో డబ్బు లేక నిరుపేద కుటుంబం కావడంతో దాతల కోసం ఎదురుచూస్తుంది. ఈ తరుణంలో చేయూత ట్రస్టుకు సమాచారం అందడంతో వెంటనే స్పందించి శనివారం వైద్య ఖర్చుల కోసం రూ.8000 ఆర్థిక సాయం అందజేశారు. చేయూత ట్రస్ట్ ఏర్పడి 15 రోజులకే రెండు మంచి కార్యక్రమాలు చేపట్టడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కే.వెంకటేశ్వర్లు, మోరంపల్లి బంజరు గ్రామ ఉపసర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు జక్కిరెడ్డి మల్లారెడ్డి, గాది నర్సిరెడ్డి, కే.నాగిరెడ్డి, హౌటల్ అనీఫ్, గంట మస్తాన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.