Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమె పోరాట స్ఫూర్తితో రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పిలుపు
నవతెలంగాణ-భద్రాచలం
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొరలనెదురొడ్డి నిలిచిన వీర వనిత చిట్యాల చాకలి ఐలమ్మ అని, ఆమె పోరాట స్ఫూర్తితో ''సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు'' నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 37వ వర్ధంతి సభ పార్టీ కార్యాలయం నందు శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు పూలమాల వేశారు. అనంతరం బండారు శరత్ బాబు అధ్యక్షతన జరిగిన శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారసులు కమ్యూనిస్టులేనని పాలకవర్గాలు చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తోటి, స్వాతంత్ర ఉద్యమం తోటి ఏమాత్రం సంబంధంలేని ఆర్ఎస్ఎస్, బిజెపి లు మతపరమైన అంశాన్ని చూపించి విమోచన దినంగా జరపాలని ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం సెప్టెంబర్ 17న విలీన దినోత్సవంగా జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎం రేణుక, సున్నం గంగా, కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకట రామారావు, పి సంతోష్ కుమార్, ఎన్ లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు యు జ్యోతి, ఎం నాగరాజు, జీవనజ్యోతి, కుంజా శ్రీను, జి లక్ష్మీకాంత్, ఎస్ భూపేంద్ర, సిహెచ్ మాధవరావు, కోరాడ శ్రీనివాస్ మరియు శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : తెలంగాణ సాయుధ పోరాట నిప్పుకణిక చాకలి ఐలమ్మ అని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు అన్నారు. ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం శనివారం స్థానిక మంచికంటి భవన్లో జరిగింది. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి బాలరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైజాం తొత్తు, మధ్య యుగాల భూస్వామ్య వ్యవస్థ ప్రతినిధి, నరరూప రాక్షసుడైన విసునూరు దేశ్‌ముఖ్‌ను ఎదిరించిన మట్టి మనిషి చాకలి ఐలమ్మ అన్నారు. 'నీ కాళ్ళు మొక్కుత దొరా! నీ బాంచెన్ దొరా!' అన్న తెలంగాణ రైతు కూలీ బిడ్డలు, ఆ దొరలకు వ్యతిరేకంగా గుతపలు, వడిసెల, తుపాకులతో తిరగబడ్డారనీ, ఐలమ్మ ఆ మహత్తర తిరుగుబాటుకు స్ఫూర్తి, సంకేతం అయిందన్నానరు. ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్రజెండా పట్టి, పోరాడిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, పట్టణ కమిటీ సభ్యులు డి. వీరన్న, సందకూరి లక్ష్మి, నందీపాటి రమేష్ సలీం, రసూల్ బి. భద్రం తదితరులు పాల్గన్నారు.
ఐద్వా ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి
చాకలి ఐలమ్మ వర్ధంతిని ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక మధుర బస్తీలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళిఅర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి సందకూరి లక్ష్మీ మాట్లాడారు. దొరల గడీల ముందు వంగి వంగీ నడుస్తున్న తెలంగాణ మట్టి మనుషుల్ని చాకలి ఐలమ్మ నిటారుగా నిలబెట్టిందని తెలిపారు. ఆమె పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకు వెళ్లి మహిళా హక్కుల కోసం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు అన్నవరపు ఇందిర, నందిపాటి రజిత, రసూల్‌బీ, కళావతి, రమ, రాజ్యలక్ష్మీ, రసూల్ తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని రైతు సంఘం మండల అధ్యక్షులు పెద్ది ని వేణు అన్నారు. శనివారం సీపీఐ(ఎం) కార్యాలయంలో మండల కమిటీ సభ్యుడు రామ అడుగు వెంకటాచారి అధ్యక్షతన ఐలమ్మ 37వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి జంగిలి వెంకటరత్నం, మండల కమిటీ సభ్యులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, శాఖ కార్యదర్శి రాజ, రజక వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షులు రాములు, ప్రధాన కార్యదర్శి నాగులు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : వీరతెలంగాణ రైతాంగ సాయధ పోరాటాన్ని రగల్చిన అగ్నికణం ఐలమ్మని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య, పార్టీ మండల కార్యదర్శి అబ్దుల్ నబీ అన్నారు. చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి ఏలూరు భవన్లో శనివారం ఘనంగా నిర్వహించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్, వజ్జా సురేష్, మన్నెం మోహనరావు, కూకట్ల శంకర్, జైమున్నిసా, సంధ్య, లక్ష్మి, నాగరాజు, మైముద్ తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని 37వ వర్ధంతి సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి జిల్లా సీపీఐ(ఎం) సెక్రటేరియట్ మెంబర్ కొక్కెరపాటి పుల్లయ్య పూలదండ వేసి, నివాళ్లు అర్పించారు.
దుమ్ముగూడెం : వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సరియం రాజమ్మ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్యలు పిలుపునిచ్చారు. శనివారం ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో కన్నాపురం గ్రామంలో,
పార్టీ ఆధ్వర్యంలో ములకపాడు సెంటర్లోని యలమంచి సీతారామయ్య భవనంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సభ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగింది. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన వారు మాట్లాడారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, జిల్లా కమిటీ సభ్యురాలు రాజమ్మ, పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి శ్రీను బాబు, మండల కమిటీ సభ్యులు ఎండి మహమ్మద్ బేగ్, సర్పంచ్ పార్వతి, ఉప సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : వీరనారి ఐలమ్మ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఐలమ్మ 37 వర్ధంతిని నిర్వహించారు. సారపాకలో రెండు సెంటర్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటేశ్వర్లు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, మాట్లాడారు. సెప్టెం బర్ 10 నుండి 17 వరకు తెలంగాణ రైతన్న పోరాటం వార్షికోత్సవం జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, భయ్యా రాము, రాయల వెంకటేశ్వర్లు, సభ్యులు నిమ్మల అప్పారావు, తిరుపతయ్య, ప్రతాప్, శనగ రమేష్, నరసింహారావు, సీత, నాగమణి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు : ఐలమ్మ పోరాట స్ఫూర్తితో సమరశీల ఉద్యమాల నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. శనివారం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శలు గార్లపాటి వీరభద్రం, ఎస్కే చాంద్ పాషా, లక్ష్మయ్య, ముత్తయ్య, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో : మండలంలోని పాపకల్ గ్రామంలో సీపీఐ(ఎం) శాఖ ఆధ్వర్యంలో ఊడాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన పార్టీ మండల కార్యదర్శి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : విసునూరు దేశ ముఖ్లకు వ్యతిరేకంగా భూ పోరాటానికి నాంది పలికిన తొలి మహిళా వీరవనిత ఐలమ్మ అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ తెలిపారు. రజక వృత్తిదారుల సంఘం అశ్వారావుపేట పట్టణ కమిటీ ఆద్వర్యంలో శనివారం ఐలమ్మ వర్ధంతిని నిర్వ హించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో రజక వృత్తిదారుల సంఘం అశ్వారావుపేట పట్టణ గౌరవ అధ్యక్షులు అల్లాడి నారాయణ, గుమ్మడి అప్పన్న, బుక్కూరి బుజ్జి బాబు, యువజన విభాగం ఉపాధ్యక్షులు గుమ్మడి ఆదినారాయణ, నాగేశ్వరరావు, కృష్ణ, కోశాధికారి గాడిచర్ల శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాసరావులు పాల్గొన్నారు.