Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల పరిధిలోని మోరం పల్లి బంజరు గ్రామంలో శనివారం పలు కుటుంబాలను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించారు. మోరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేతుల పెదవీర్రాజు తండ్రి చేతుల సోమయ్య ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి దశదినకర్మలకు హాజరై, మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన మూల ముసలా రెడ్డి కొన్ని రోజుల క్రితం మరణించడంతో వారి నివాసానికి వెళ్లి మృతుడి చిత్రపటానికి, పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అలాగే మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన కైపు లక్ష్మమ్మ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. ఈ క్రమంలో వారి నివాసానికి చేరుకొని మృతురాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ పొడియం ముత్యాలమ్మ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, సొసైటీ అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పార్టీ యువజన మండల అధ్యక్షులు గోనెల నాని, పార్టీ నాయకులు కామిరెడ్డి రామ కొండారెడ్డి, లక్ష్మీ నారాయణ రెడ్డి, నర్సిరెడ్డి, సొసైటీ డైరెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.