Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించబడినది 8.34 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యము, ఈ నెల 9వ తారీకు వరకు నిర్దేశించబడిన ఉత్పత్తి లక్ష్యము 2.56 లక్షల టన్నుల ఉత్పత్తి లక్షానికి గాను 2.64 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 103 శాతం ఉత్పత్తి సాధించామని ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ తెలిపారు. శనివారం రుద్రంపూర్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అదే విధముగా 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 9వ తారీకు వరకు 53.71 లక్షల టన్నులకు గాను 48.40 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 90 శాతం ఉత్పత్తి సాదించామని తెలిపారు.సెప్టెంబర్ 9వ తారీకు వరకు రోడ్డు, రైల్ మార్గం ద్వారా 2.90 లక్షల టన్నులు రవాణా చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 9వ తారీకు వరకు 51.31 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఏరియా ఎస్ఓటు జిఎం రమేశ్, ఏరియా ఇంజనీర్ రఘు రామ రెడ్డి, ఏజిఎం సూర్యనారాయణ, డిజిఏం.(పర్సనల్) సామూయెల్ సుధాకర్, డిజిఏం (ఐఈ) యోహాను, ఆర్సిహెచ్పి. డిజిఏం.(ఈఅండ్ఎం) వెంకటేశ్వర్లు, డిజిఏం (ఎఫ్ అండ్ ఏ) రాజశేఖర్, పివికె-5 ఎస్ఓఎం. పాలడుగు శ్రీనివాస్, ఏరియా వర్క్ షాప్ ఎస్ఈ (ఈఅండ్ఎం) శ్రీకాంత్, పర్చేస్ ఎస్ఈ (ఈ అండ్ఎం) బులి మాధవ్, ఏరియా స్టోర్స్ ఎస్ఈ (ఈఅండ్ఎం) ప్రకాష్, పర్సనల్ మేనేజర్ జి.బుచ్చయ్య, జికేఓసి. సీనియర్ పిఓ.ఎం. శ్రావణ్ కుమార్, ఎస్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ సాగర్ పాల్గొన్నారు.