Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశ్వారావుపేటలో ఆశాల జిల్లా మహాసభలు
- ముఖ్య అతిథిగా హాజరైన
- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యం.వి అప్పారావు
నవతెలంగాణ-అశ్వారావుపేట
గ్రామీణ ప్రాంతంలో పేదలకు ఆరోగ్య సేవలందించే ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కరించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షత ప్రదర్శిస్తున్నాయని, పాలకుల మెడలు వంచాలని, అంటే పోరాట మార్గమే శరణ్యం అని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యం.వి అప్పారావు అన్నారు. శనివారం ఆశా వర్కర్లు జిల్లా మూడవ మహాసభలు సమత, ఝాన్సీ అధ్యక్షతన స్థానిక సత్యసాయి బాబా కళ్యాణ్ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కీం వర్కర్స్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పని చేస్తున్న వీరికి దక్కేది అరకొర వేతనాలు మాత్రమే అని, ఆకాశాన్ని తాకే ధరలతో ప్రభుత్వం ఇచ్చే చాలీచాలని జీతాలతో కుటుంబాల పోషణ కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు. సహజ వనరులను, ప్రజా సంపదను కుబేరులకు కట్టబెడుతూ అన్నివర్గాల ప్రజలపై బీజేపీ ప్రభుత్వం భారాలు మోపుతుంది అన్నారు. ఆశ వర్కర్స్కు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి ఉద్వేగ భద్రత చట్ట బద్ద సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్, ముదిగొండ రాంబాబు, నాగమణి, రాధ, ధనలక్ష్మి, సుశీల తదితరులు పాల్గొన్నారు.