Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటిలో మునిగిన పగిడేరు
నవతెలంగాణ-మణుగూరు
రెండు రోజుల నుండి మండలంలో వర్షం దంచి కొడుతుంది. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు కుంభ వర్షం కురిసింది. పగిడేరు పంచాయతీలో పోచంపల్లి వాగు ఉదృతంగా ప్రవహించడంతో పాతూరులో సుమారు 30 గృహాలు నీటి పాలు అయ్యాయి గ్రామంలో రోడ్డు కోత గురైంది జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జియో విద్యుత్ ప్లాంట్ ప్రదేశంలో వరద నీరు చేరింది పరిసర ప్రాంతాలలో వరద కారణంగా ప్లాంట్ ఆవరణంలో అనేక వస్తువులు కొట్టుకుపోయాయి. రామనుజవరం పడేరు పంచాయతీ మధ్యలో ఉన్న పీతిరి వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రామనుజవరం- సాంబాయిగూడెం ప్రధాన రహదారి ముంపుకు గురైంది. రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీ వర్షాల కారణంగా ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి అంతరం ఏర్పడింది. పోచంపల్లి చెరువు, ఇప్పగట్టు చెరువు అలుగుల ఉధృతి కారణంగా ప్రతి సంవత్సరం పగిడేరు గ్రామం ముంపుకు గురవుతుందని పోచంపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.