Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని
నవతెలంగాణ-సుజాతనగర్
ఏదుల వాగుపై బ్రిడ్జి నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య డిమాండ్ చేశారు. మండల పరిధిలోని సీతంపేట-సుజాతనగర్లను కలిపే ఏదుల వాగు బ్రిడ్జి కుంగిన ప్రదేశాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏదుల వాగుపై నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ పాత బ్రిడ్జి చెప్తా కింది నుంచి ఇసుక కాంక్రీటు తొలగించడంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు బ్రిడ్జ్ కుంగిపోయి కూలిపోయింది అన్నారు. ఈ రహదారి పై నిత్యం వందలాది మంది ప్రయాణాలు కొనసాగిస్తారని, చుట్టూ తిరిగి రావడం వలన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వీర రమేష్, కొండే కృష్ణ, ఉడుగుల శ్రీకాంత్, నల్ల గోపు పుల్లయ్య, గండమళ్ళ భాస్కర్, నర్ర శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.