Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఉమ్మడి ఖమ్మం జిల్లా మహాత్మజ్యోతిబాపులే విద్యాసంస్థలకు సంబంధించిన క్రీడోత్సవాలు బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగిశాయి. ఈ పోటీల్లో జిల్లాలోని 11 పాఠశాలల నుండి 385 విద్యార్ధులు పాల్గొని ప్రతిభ కనబరిచారు.వారిలో 35 ప్రతిభావంతమైన విద్యార్ధులను రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు సెలెక్ట్ చేయడం జరిగింది. పాలేరు బీసీ గురుకుల పాఠశాల విద్యార్ధులు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ని, మణుగూరు బీసీ గురుకుల పాఠశాల విద్యార్ధులు అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకున్నారు. గెలుపొందిన విద్యార్ధులకు ముగింపు కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ముగింపు కార్యక్రమానికి హాజరైన జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ జి. జ్యోతి మాట్లాడుతూ.. క్రీడా విద్యార్ధుల్లో పట్టుదల ఎక్కువగా ఉంటుందని, ఈ స్ఫూర్తి వారికి భావిజీవితంలో చాలా ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఈ నెల 13 నుండి 15వ తేదీ వరకు జూనియర్ విభాగంలో క్రీడా పోటీలు ఉంటాయన్నారు. అందులోను 11 పాఠశాలల నుండి విద్యార్ధులు పాల్గొంటారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మల్లయ్య, ఎస్.ఒ. జయరాజ్, వివిధ పాఠవాలల ప్రిన్సిపల్స్, పిఇటిలు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని గెలుపొందిన విద్యార్ధులకు బహుమతి ప్రదానం చేశారు..