Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధిర కోర్టు న్యాయమూర్తి ధీరజ్ కుమార్
నవతెలంగాణ-ఎర్రుపాలెం
విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తూ చదువుల్లో బాగా రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మధిర కోర్టు న్యాయమూర్తి ధీరజ్ కుమార్ బాల బాలికలకు సూచించారు. మండ కేంద్ర మైన ఎర్రుపాలెం గురుకుల పాఠశాలను, ఎస్సీ బాలుర వసతి గృహాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల తల్లిదండ్రులతో, బాలికలతో మాట్లాడి వారికి అందుతున్న వసతుల గురించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన బాలికల వివాహ వయసుపై వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలని పాఠశాల ప్రిన్సిపల్ ఎం.పద్మావతికి సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుధ్యంపై సిబ్బందికి సూచనలు చేశారు. స్వచ్ఛ గురుకుల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రభాకర్, న్యాయవాది గంధం శ్రీనివాసరావు, లీగల్ సెల్ అథారిటీ సూపరింటెండెంట్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.