Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి 75వ వసంతం అడుగిడుతున్న సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించనుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం స్థానిక ఎంఆర్ గార్డెన్లో ఆర్డీవో సూర్యనారాయణ అధ్యక్షతన వేడుకల నిర్వహణపై ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రతినిధులతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈనెల 16 నుంచి 18 వరకు ఈ వజ్రోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే మాదిరిగా ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలపై జెండా ఆవిష్కరణ చేయాలన్నారు. 16వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 17న హైదరబాద్‌లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఆవిష్కరణ, ప్రసంగం ఉంటుందన్నారు. అదే రోజు (17న) జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సి పాలిటీ, పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేయాల న్నారు. 16న నియోజకవర్గ కేంద్రమైన సత్తుపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించా లన్నారు. మొక్కుబడిగా కాకుండా రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చేలా వినూత్న తరహాలో వేడుకలు ఉండాలన్నారు. ఇందుకు విద్యా సంస్థలు పూర్తిస్థాయిలో సహకారం అందించాలన్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల బాధ్యులతో సూచనలు, సలహాలను స్వీకరించారు. వేడుకలకు ఇంకా కొంత సమయం ఉన్నందున సలహాలు ఇవ్వదలచిన వారు ఆర్డీవోకు తెలియజేయాలన్నారు. సుమారుగా 10వేలకు పైగా ప్రజలు పాల్గొనేలా కృషి జరగాలన్నారు. ర్యాలీ అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అందరికి సిద్దారం రోడ్డులోని ఎంఆర్ గార్డెన్, లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాళ్లలో భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ ఎన్.వెంకటేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, కమిషనర్ కోడూరు సుజాత, పెనుబల్లి, తల్లాడ ఎంపీపీలు అలేఖ్య, శ్రీనివాసరావు, జెడ్పీటీసీ చెక్కిలాల మోహనరావు సత్తుపల్లి, వేంసూరు తహసీల్దార్లు వెంకటేశ్వరరావు, ముజాహిద్, విద్యా సంస్థల బాధ్యులు జీవీ లింగారెడ్డి, పసుపులేటి నాగేశ్వరరావు, నాయుడు వెంకటేశ్వరరావు, స్వచ్ఛంద సంస్థలు చిత్తలూరి ప్రసాద్, చల్లగుళ్ల అప్పారావు, ఫుడ్‌బ్యాంకు ఆశాఖాన్ పాల్గొన్నారు.