Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్ష పార్టీలకు రాష్ట్ర కార్మిక సంఘాలకు జేఏసీ విజ్ఞప్తి
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని, జీవో నెం-60ని అమలు చేయాలని ఫిబ్రవరి 9వ సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9 నుంచి సింగరేణి కాంట్రాక్టు కార్మికు చేస్తున్న సమ్మెకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలను, రాష్ట్ర కార్మిక సంఘాలకు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు హైదరాబాద్లో ఆదివారం ఆయా పార్టీల కార్మిక సంఘాల నాయకులను కలిసి లేఖలు అందజేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్రెడ్డి, సీపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టీజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరామ్, సీఎల్పీ నేత మల్లు బట్టీ విక్రమార్క, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్.భోస్, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు బి.రవీందరాజ్ వర్మ, ఐఎఫ్టియూ రాష్ట్ర 'కార్యదర్శి సూర్యం, ఎం.శ్రీనివాస్ తదితరులను జేఏసి నాయకులు కలిసి లేఖలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, బి.మధు, యర్రగాని కృష్ణయ్య ఇవవనూరి నాగేశ్వరరావులు ఉన్నారు.