Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్ టేబుల్ సమావేశం జిఎంపిఎస్ డిమాండ్
నవతెలంగాణ-భద్రాచలం
ప్రభుత్వం గొల్ల కురుమలకు పంపిణీ చేస్తున్న గొర్రెలకు బదులుగా, నగదు అకౌంట్లో జమ చేయాలని తెలంగాణ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం గౌరవ అధ్యక్షులు కాసాని ఐలయ్య డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణం శ్రీకృష్ణ టెంపుల్ ఆవరణలో బొల్లి. సత్యనారాయణ, బచ్చల కురు శ్రీను అధ్యక్షత జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఐలయ్య మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ చేయడం వల్ల అవి ఈ వాతావరణంలో పెరగక అనారోగ్యం బారిన పడి చనిపోతున్నాయని, దీనివలన గొర్రె కాపర్లు నష్టపోతున్నారని అన్నారు. అలాగే ఈ పథకం వలన దళారీ వ్యవస్థ పెరిగి ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరక, గొల్ల కురుమలు కూడా నష్టపోతున్నారని అన్నారు. నేరుగా ఎకౌంట్లోకి నగదు జమ చేయడం వలన గొల్ల కురములు వారికి నచ్చిన గొర్లు ఈ ప్రాంతంలో కొనుక్కుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు తిరిష్, జిల్లా కమిటీ సభ్యులు పాండవుల రామనాథం, లింగన్న, కుమ్మరి కుంట సాంబశివరావు, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం. స్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి ఆకోజు, సునీల్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సత్యం, యాదవ సంఘం నాయకులు ఆవుల. వెంకన్న, సైదేశ్వరావు, బచ్చలకూర. వీరాస్వామి, నల్లగొర్ల ప్రభాకర్, చిలక. వెంకన్న, అద్దాల. రాంబాబు, ఈర్ల రమణయ్య, నక్క సతీష్ తదితరులు పాల్గొన్నారు.