Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంపు ప్రాంతాలకు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలి
- జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య దొర
నవతెలంగాణ-బూర్గంపాడు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య మంత్రులు గోదావరి వరదల వల్ల బూర్గం పాడు మండలం ముంపునకు గురవుతున్న ప్రాంతాల పై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉమ్మడి ఖమ్మం జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య దొర అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన బూర్గంపాడులో జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 24 రోజులుగా బూర్గం పాడులో సాగుతున్న రిలే నిరాహార దీక్షలపై పాలక ప్రభు త్వాలు స్పందించా లని ఆయన అన్నారు. బూర్గం పాడులోని దీక్షల పట్ల స్థానిక ఎమ్మెల్యే స్పందిం చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు న్యాయ పరంగా చేస్తున్న ఈ డిమాండ్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రులు స్పందించి పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. ఆదివారం సిపిఐ మండల నాయకులు దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ దీక్షలో సిపిఐ మండల నాయకులు పేరాల శ్రీనివాసరావు, సుబ్బా రెడ్డి, సిద్ధారపు, ఎస్ కే జహీర్, పిచ్చమ్మ , పెరుమళ్ళ, ఎస్ కె గౌస్య బేగం సాజిద్ ఎండి తదితరులు కూర్చున్నారు. ఈ దీక్షలో పాల్గొన్న వారికి జేఏసీ కన్వీనర్ కేవీ రమణ పూలమాలలు అందించి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం తలపెట్టిన ''చలో కలెక్టరేట్ ''కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చందా సంతోష్, బర్ల నాగమణి, భాగి వెంకట్రావు, మహమ్మద్ ఖాన్, సిపిఎం నాయకులు రాయల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ సందర్శించి సంఘీభావం ప్రకటించారు.