Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల పరిష్కారం కోసమే..
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం 18 సెంటర్లలో ఒక్కరోజు నిరాహార దీక్షలను నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం ఖమ్మం సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ 57 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారని, హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా అర్హులకు కాకుండా అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా పెన్షన్స్ ఇస్తున్నారని, ఇప్పటికైనా వారు స్పందించి అర్హతలు ఉన్న 57 సంవత్సరాలు నిండిన అర్హులకు పింఛన్లు ఇవ్వాలని, అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న పింఛన్లు అన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సొంత జాగా ఉన్నవారికి మూడు లక్షల ఇస్తామని సీఎం చెప్తున్నారని, సొంత స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అర్హులైన వారందరిికీ డబల్ బెడ్ రూముల్ను ఇవ్వాలని, డబల్ బెడ్ రూమ్ ఇవ్వని యేడల ఇల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి సంవత్సరం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు 100 కోట్లు కేటాయిస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఎన్ని కోట్లు కేటాయించారో తెలపాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆఫోజ్ సమీనా మాట్లాడుతూ నగరంలోని మిషన్ భగీరథ పైపులు లీకేజీ కారణంగా తాగునీరు కలుషితమై ప్రజలు వ్యాధులు పారిన పడుతున్నారని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరథ పైపులకు మరమ్మత్తులు నిర్వహించి, గుంతలు పూడ్చి చాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వై.విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు ఎర్రా శ్రీనివాసరావు, దొంగల తిరుపతి రావు, త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీను, ఖమ్మం అర్బన్ కార్యదర్శి బత్తిన ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.