Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
దేశంలో ప్రతిష్ఠాత్మక ఐఐటి కళాశాలలలో ప్రవేశానికై గత నెల 28న నిర్వహించిన జెఈఈ అడ్వాన్స్ పరీక్షలో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి, ఆదివారం ప్రకటించిన జెఈఈ అడ్వాన్స్ ఫలితాలలో హార్వెస్ట్ కళాశాల విద్యార్ధులు విజయకేతనాన్ని ఎగురవేశారని హార్వెస్ట్ కళాశాల కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపల్ పార్వతీరెడ్డి తెలిపారు. తమ కళాశాల నుంచి 53 మంది అడ్వాన్స్ పరీక్ష రాయగా జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను తమ విద్యార్ధులు సాధించారని తెలిపారు. తమ విద్యార్థులు జి.ధనుంజరు అల్ ఇండియా 436వ ర్యాంకు, ఇ.డబ్ల్యూ.ఎస్‌లో 40వ ర్యాంకు సాధించి, ఎన్.ఆదర్ష్ ఎస్.సి.క్యాటగిరిలో 540వ ర్యాంకు, పి.శ్రీవెంకటనాగ వర్షిత్ 3822వ ర్యాంకు, ఓ.బి.సి. క్యాటగిరిలో ఎమ్.సాత్విక్ 3598వ ర్యాంకు, జి.ఉజ్వల సాయి రాహుల్ 7737 ర్యాంకులు, వై.చక్రధర్ రెడ్డి ఆల్ఇండియా జనరల్ ర్యాంకు 8575, ఇ.డబ్ల్యూ.ఎస్ కోటాలో పి.అనితారెడ్డి 1761, సి.హెచ్. సరయు 2344, ఎ.మోక్షజ్ఞసాయి 2853, ఎమ్.శశాంక్ఆదిత్య 3348, ఎ.హేమంత్ 3478, ర్యాంకులు సాధించగా, ఎస్టి కోటాలో జి.అఖిరా నందన్ 1423వ ర్యాంకు, ప్రిపరేటరీ ర్యాంకుల విభాగంలో జి.ప్రణరు 231వ ర్యాంకు, బి.అశోక్ 707వ ర్యాంకు, కె.అన్వేష్ 2392వ ర్యాంకు, యస్.యతేంద్రకుమార్ 2839వ ర్యాంకుల సాధించారన్నారు. అతి తక్కువ మంది విద్యార్థులతో తమ విద్యాసంస్థలు అద్భుత ఫలితాలు సాధించడం గర్వ కారణమ న్నారు. తమ విద్యాసంస్థలు తిరుగులేని విజయంతో ఉత్సాహాన్ని నింపా యని, ర్యాంకులు సాధించిన తమ విద్యార్థులందరిని అభినందిస్తూ క్రమమైన పద్ధతిలో విద్యను అందించడం, ప్రోత్సహించడం, విద్యార్థులు ఆచరించే విధంగా చూడడం, తమ అభిమతమన్నారు. తమ విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తూ, పటిష్టమైన ప్రణాళిక రూపొందిస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారానే ఈ విజయాలు చేకూరుతున్నాయని, నాణ్యమైన అధ్యాపక బృందం బోధన, యాజమాన్య నిరంతర పర్యవేక్షణ ఈ విజయాల కు కారణమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల నిరంతర కృషిని వారు అభినందించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత ఆశలతో ముందుకు వెళ్ళి భవిష్యత్ విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు.