Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయానా ప్రకటిం చినా అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ అందటం లేదని, వెంటనే 57 సంవత్స రాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు అందజేయాలని సిపిఎం పాలేరు డివిజన్ ఇంచార్జి బండి రమేష్, మండల ఇన్చార్జి బుగ్గవీటి సరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో మల్లెల సన్మత్ రావు అధ్యక్షత జరిగిన విస్తృత జనరల్‌బాడీ సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆసరా పెన్షన్ అందించాలని, అలాగే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతుల సమస్యలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో కనీస సౌకర్యాలు లేవని, వెంటనే ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు కల్పించి సమస్యలు పరిష్కరించాలని, అలాగే ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇండ్లు నిర్మించుకునేదుకు రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, మండల కమిటీ సభ్యులు శీలం గురుమూర్తి, తోటకూరి రాజు, తాళ్లూరి వెంకటేశ్వర్లు, వీరారెడ్డి, గన్యా తదితరులు పాల్గొన్నారు.