Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదివారం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని పెరికసింగారం గ్రామంలో అంబేద్కర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన గణనాథుడుని దర్శించు కున్నారు. అనంతరం ఇటీవల మరణించిన కొత్త వీరారెడ్డి చిత్ర పటానికి పూలమాలవేసి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి రూ. 10వేల ఆర్ధిక సహయాన్ని అందించారు. మండలంలోని రాజుపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఉప్పల వీరయ్య కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థికసాయం అందించారు. మండలం మునిగేపల్లి గ్రామ ప్రజల, విద్యార్థుల కోరిక మేరకు పాలేరు కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సర్వీసుని ప్రారంభించి, బస్సులో ప్రయాణించారు. దీంతో గ్రామంలో ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కట్ల వీరయ్యని పరామర్శించారు. మండల కేంద్రంలోని ప్రగతి విద్యాలయంలో యలక వెంకటరెడ్డి ప్రధమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై, వారి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆయన వెంట ఎంపిపి బానోత్ శ్రీనివాస్ నాయక్, డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు, కార్యదర్శి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.