Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ పోరాటాలకు కార్యచరణ రూపొందించుటకు ఈ నెల 14,15,16 తెదీలలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ తెలిపారు. మహాసభల జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులతో గోడ పాత్రలను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పద్దం మేఘన, మండల అధ్యక్షురాలు మంజుల నాయకులు పవణ్, పృథ్వీ, మనోజ్ సుమంత్ ప్రసాద్ వెంకట్ శివ తదితరులు పాల్గొన్నారు.