Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంపు ప్రాంత ప్రజల ఆందోళన
- కలెక్టరేట్ ముందు ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
గోదావరి వరదల నుండి మా ప్రాణాలు కాపాడాలని, ముంపు నుండి మమ్ములను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని, బూర్గంపాడు మండలం గోదావరి ముంపు ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించి, కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితకుటుంబాల వారు మాట్లాడారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న గోదావరి వరదల నుండి రక్షించాలన్నారు. ఈ ఏడాది వచ్చి వరదల వనల ఆస్తులు పూర్తిగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. పూర్తిగా మునిగి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 18 గ్రామాలు ముంపుకు గురిఅవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మూగజీవాలు, పశువులు ప్రాణాలో కోల్పోయాయని తెలిపారు. మనుషుల ప్రాణాలైన రక్షించాలని డిమాండ్ చేశారు. వర్షాలు కురుస్తున్నాయని, గోదావరికి వరద వస్తుందని సమాచారం తెలిస్తేనే భయ బ్రాంతులకు గురికావాల్సి వస్తుందని, తెలిపారు. ఇటీవల నష్టపోయిన కుటుంబాలకు పూర్తిస్థాయిలో నష్టం అందలేని వాపోయారు. పోలవరం ముంపు ప్రాంతంగా గుర్తించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కేంద్ర, రెండు తెలుగు ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చందా సంతోష్, మహిళా నాయకురాలు బర్ల నాగమణి, పూలపెల్లి సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు లక్కినేని సురేందర్, బాగే వెంకట్రావు, చల్లా వెంకటనారాయణ, సీపీఐ పార్టీ నాయకులు పేరాల శ్రీనివాసరావు, ఎస్కె.గౌసియా బేగం, సీపీఐ(ఎం) నాయకులు రాయల వెంకటేశ్వర్లు, భయ్యా రాము, కొమ్మరాజు సత్యనారాయణ, టీడీపీ నాయకులు తాళ్లూరి జగదీష్, మాధవి లత, సత్యనారాయణ, బీజేపీ నాయకులు దామర శ్రీనువాసరావు, ముస్లిం మైనారిటీ సంఘం నాయకులు మహమ్మద్ మున్నా, ఎస్కె.నసిరుద్దీన్, తెలంగాణ జన సమితి నాయకులు మల్లెల రామనాథం, కరుణాకర్ రెడ్డి, తెలంగాణ వైయస్సార్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, మహిళా సంఘం నాయకులు కుంజా వెంకటరమణ, కేసుపాక భూబమ్మ, కొమ్ము వెంకటరమణ, బుయన ఆదెమ్మ, సెనగ ధనలక్ష్మి, పెరుమాళ్ళ వెంకటలక్ష్మి, చిన్నక్క, పుట్టి చంద్రకళ, పుట్టి ఈశ్వరమ్మ, నందిపాటి కళావతి, మహి సాక్షి రామసీత, తదితరులు పాల్గొన్నారు.