Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులం, మతం, ప్రాంతాలుగా చీల్చుతున్న బూర్జువా పార్టీలు
- విశాల భావనే భారత దేశానికి మేలు
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని
నవతెలంగాణ-అశ్వారావుపేట
అధిక ధరలు, జీఎస్టీ పేరుతో పేద ప్రజానీకం దగ్గర గుంజిన ప్రజా ధనాన్ని కేంద్రం, రాష్ట్ర పాలకులు పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య ధ్వజం ఎత్తారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో విస్తృత సర్వసభ్య సమావేశం సోమవారం నందిపాడులో మండలం కమిటీ సభ్యుడు మడకం పెద్ద ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాసాని హాజరై మాట్లాడారు. అధికారమే పరమావధిగా కులాల పేరుతో ఒక పార్టీ, మతం ముసుగులో మరో పార్టీ, ప్రాంతీయతా బేధాలు రెచ్చగొడుతూ ఇంకో పార్టీ సమాజాన్ని విభజించి పబ్బం గడుపు కుంటున్నాయి అని ఆవేదన చెందారు. ఎవరు ఎన్ని మాయమాటలు చెప్పినా భిన్న సంస్కృతులు ఉన్న భారత దేశానికి విశాల భావం, లౌకిక తత్వమే శిరోధార్యం అని అన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య మాట్లాడుతూ ప్రజాప్రయోజన రీత్యానే రాజకీయ ఎత్తుగడలు ఉంటాయని అందులో భాగంగానే సీపీఐ (ఎం) మతతత్వ భావనకు వ్యతిరే కంగా టీఆర్ఎస్తో తాత్కాలిక ఎన్నికల ఒడంబడికకు రావడం జరిగిం దని పార్టీ శ్రేణులకు వివరిం చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, పార్టీ సీనియర్ నాయకులు ఊకే వీరాస్వామి, ఉప సర్పంచ్, మండల కమిటీ సభ్యులు తుట్టి వీరభద్రం, గడ్డం సత్యనారాయణ, నాగేశ్వరరావులు పాల్గొన్నారు.