Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు మిడియం బాబురావు
నవతెలంగాణ-చర్ల
సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎంపీ మీడియం బాబురావు అన్నారు. సోమవారం స్థానిక బిఎస్ రామయ్య భవన్లో కార్యదర్శి కారం నరేష్ అధ్యక్షతన వీర తెలంగాణ సాయుధ రైతంగా పోరాట వార్షికోత్సవ సభల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 సంవత్సరంలో ప్రారంభమై 1959వ సంవత్సరం వరకు పది సంవత్సరాలపాటు కొనసాగిందని, అందులో కీలక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో నైజాం ఎస్టేట్ విలీనం కావడం చారిత్రక వాస్తవం అన్నారు. ఆ రోజుల్లో ఉద్యమంతో సంబంధంలేని పార్టీల నాయకులు సాయుధ పోరాటాలపై వక్ర భాస్యాలు చేస్తూ ఉన్నారని అన్నారు. విముక్తి విమోచన విలీనం విద్రోహం అంటూ ఎవరికి వారు నినాదాన్ని ఉచ్చారణ చేస్తున్నారని ఆయన వాపోయారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ముస్లిం నుండి విముక్తి కలిగిందని వాస్తవాలను కప్పిపుచ్చుకొని నాటకం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడి నిరుపేదలకు వందల ఎకరాల భూమిని పంచిన చరిత్ర సీపీఐ(ఎం)కి ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, కారం నరేష్, కోటి ముత్యాలరావు, పొడుపు గంటి సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.