Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష
నవతెలంగాణ-రఘునాధపాలెం
ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని సీపీఐ(ఎం) అర్బన్ మండల పార్టీ ఆధ్వర్యంలో పాండురంగాపురంలో ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేసినటువంటి వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వారందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ వచ్చేలా చూడాలన్నారు. ఇంటి స్థలం కలిగి ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అమలు పరచటంలో శూన్యంగా వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు. అర్హలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నాయకుల జోక్యం ఉండరాదని డిమాండ్ చేస్తూ దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, అర్బన్ మండల కార్యదర్శి బత్తిని ఉపేందర్, శాఖ కార్యదర్శి తీగల వెంకటేశ్వర్లు, మహిళా సంఘం నాయకురాలు, ముక్కుపాటి నాగమణి, అంకిరెడ్డి లింగయ్య, ఉపేంద్ర జాన్బీ షాకిర తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంకార్పొరేషన్ : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ సారధి నగర్లో సోమవారం సీపీఐ(ఎం) త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు శీలం వీరబాబు ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్షను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సమస్యల పరిష్కారం కోసం దీక్షచేస్తున్నట్లు తెలిపారు. ఈ దీక్ష లో శీలం వీరబాబు, ఎస్.కె కాశీ, ఎడ్లపల్లి లక్ష్మయ్య, మద్దెల పుల్లారావు, చేబోలు నరసింహారావు, లింగాల వెంకట నారాయణ, నిమ్మటూరి ఆంజనేయులు, ఎస్కే రబ్బాని, చేపూరి శ్రీధర్, ఎస్.కె హుస్సేన్, సోమయ్య, సురేష్, ఆమ్రేష్, ఎస్కే ఖాదర్, సీతారాం, మహేష్ పాల్గొన్నారు,
ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలయ్యేలా చూడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వై విక్రమ్ డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం పార్టీ టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్టీ రోడ్ (నూతన బస్టాండ్ రోడ్) వద్ద ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని వై విక్రమ్ ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 9 సంవత్సరాల కాలంలో కేవలం 2,300 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మాత్రమే ఇచ్చారని, మిగతా ఐదు వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇంకా ఎంతకాలం పడుతుందో జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో పెన్షన్లు మంజూరు చెయ్యడంలో కూడా తెరాస నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారు. తక్షణమే అర్హత వున్నవారికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు మంజూరు చేయడంలో విఫలం చెందారని ఆరోపించారు. నగరంలో ప్రజలకు పలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలపై ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ టూ టౌన్ సెక్రటరీ బోడపట్ల సుదర్శన్, నాయకులు నర్రా రమేష్, ఎండీ గౌస్, డి వీరబాబు, హుస్సేన్, భుక్యా ఉపేంద్ర, మచ్చా సూర్యం, జె వెంకన్న బాబు, సిహెచ్ భద్రం, రవీంద్ర, కె వెంకన్న, బిబీ, కుమారి, రాజేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంకార్పొరేషన్: ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమల య్యేలా చూడాలని సీపీఎం జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో 39 డివిజన్ మేదర బజార్ సెంటర్ లో సిపిఎం కమిటీ సభ్యులు ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని ఎర్రా శ్రీకాంత్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం జిల్లా నాయకులు ఎస్.కె బేగం, భాగం అజిత, వన్ టౌన్ పార్టీ సీనియర్ నాయకులు లింగయ్య, నర్సింగ్, కృష్ణారావు, వన్ టౌన్ కమిటీ సభ్యులు నాగుల్ మీరా, భాస్కర్ రాజు, కూరపాటి శ్రీనివాస్, రావులపాటి నాగరాజు, కూరపాటి సతీష్, యువజన నాయకుడు ఎలగందుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.