Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
మండల పరిధిలోని లాలాపురం గ్రామానికి చెందిన సంక్రాంతి వెంకమ్మ (100) సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించారు. ఆమెకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఆమె కూమారులు మనవళ్లు అంతా గ్రామంలో సీపీఎం పార్టీలో పనిచేస్తూ ప్రజలకు సేవలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె రెండో కూమారుడు సంక్రాంతి నర్సయ్య గోపవరం సొసైటీ డైరెక్టర్గా బాధ్యతల్లో ఉన్నారు. విషయం తెలుసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావులు మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాలాపురం గ్రామ నిర్మాణంలో సంక్రాంతి వెంకమ్మ కుటుంబం కీలక పాత్ర పోషించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో సైతం వెంకమ్మ కుటుంబ సభ్యులు పోరాడి అసువులు బాసిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. నివాళులర్పించిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, బోంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి మధు, విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి వీరభద్రం, మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు, వైరా మాజీ ఎంపీపీ బోంతు సమత, చింతనిప్పు చలపతిరావు, శ్రీనాథ్, టి.వీరభద్రం, కాంగ్రెస్ జిల్లా అద్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్, లాలాపురం బొడపోతుల బాబు, మాజీ సర్పంచ్ సంక్రాంతి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు రాంపుడి రోశయ్య, వడ్డె నారాయణ, స్థానిక సీపీఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు నివాళులర్పించారు.