Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రబోడులో దమ్మాలపాటి వెంకటేశ్వర్లు సంస్మరణ సభ
నవతెలంగాణ-కారేపల్లి
కమ్యూనిజాన్ని కడవరకు నమ్మి ఆచరించిన నేత దమ్మాలపాటి వెంకటేశ్వర్లు అని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు గుగులోత్ ధర్మలు అన్నారు కారేపల్లి మండలం ఎర్రబోడులో దమ్మాలపాటి వెంకటేశ్వర్లు సంస్మరణ సభ విశ్వనాధపల్లి ఎంపీటీసీ వడ్డే అజరుబాబు అధ్యక్షతన జరిగింది ఈ సభలో నున్నా నాగేశ్వరరావు, ధర్మాలు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ప్రలోభాలకు, స్వలాభాలకు పార్టీలు మారుతున్న నేటి కాలంలో ప్రజల కోసం, పార్టీ కోసం దమ్మాలపాటి వెంకటేశ్వర్లు పరితపించే వారన్నారు. ఏలూరి లక్ష్మీనారాయణ, పి.సోమయ్యల వెన్నంటే నడుస్తూ పార్టీ బలోపేతం కోసం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ కృషి చేసిన నాయకుడన్నారు. మాణిక్యారం ప్రాంతంలో కూలీరేట్లు, జీతగాళ్ల సమ్మెలు, ప్రజల సమస్యల పై పోరాటాలు చేసి సమస్య పరిష్కారం అయ్యేంత పట్టు వీరే వారు కాదన్నారు. సభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి నరేందర్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వజ్జా రామారావు, మండల నాయకులు పండగ కొండయ్య, కుర్సం శ్రీను, కరపటి సీతారామయ్య, కుందనపల్లి పవన్,సుంకర నరేష్,కుంజ వెంకన్న,బోజడ్ల గోవిందరావు, రేగళ్ల మంగయ్య, వల్లభనేని మురళి, మద్దెల నాగయ్య, ఎర్రబోడు సర్పంచ్ కుర్సం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన వివిధ పార్టీల నేతలు
మాణిక్కారం మాజీ సొసైటీ అధ్యక్షులు దమ్మాలపాటి వెంకటేశ్వర్లు సంస్మరణ సభకు వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు (డీవీ), కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోతు రాందాస్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, మేదర వీర ప్రతాప్ (టోనీ), గుగులోత్ భీముడు, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, జడ్పిటిసి వాంకుడోత్ జగన్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న, రైతుబంధు మండల కన్వీనర్ గుగులోతు శీను, జిల్లా సభ్యులు ఉన్నం వీరేందర్, మాజీ కన్వీనర్ హన్మకొండ రమేష్ , దిశా జిల్లా కమిటీ సభ్యులు బానోత్ కుమార్, ఎంపీటీసీలు పెద్దబోయిన ఉమాశంకర్, ధారావత్ పాండ్యా నాయక్, బానోత్ రమేష్, జడల వసంత వెంకటేశ్వర్లు, సర్పంచులు మాలోత్ కిషోర్, అజ్మీర నాగేశ్వరరావు, భూక్య రంగారావు, కుర్సం సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్లు బానోత్ హిరాలాల్, మర్సకట్ల రోశయ్య, డేగల ఉపేందర్, వాంకుడోత్ నరేష్, తహసిల్దార్ కోట రవికుమార్, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎల్.రాందాసు, వాంకుడోత్ మంగీలాల్, దశరథం, సిపిఐ జిల్లా నాయకులు ఏపూరి బ్రహ్మం, ఉంగరాల సుధాకర్, దుద్దుకూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.