Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మధిర
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈసారి తాను తప్పకుండా పోటీ చేస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మధిరలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్లోనే కొనసాగుతానని, ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానన్నారు. రానున్న రోజుల్లో రాజకీయాల్లో అద్భుతాలు జరగొచ్చని, ప్రతి నేత తన ఉనికి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడని అన్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు, తను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, మంచి రోజులు రాబోతున్నాయని వేచి చూద్దామని తెలిపారు.
మండలంలో పొంగులేటి పర్యటనలో భాగంగా సిరిపురంలో చిదిరాల వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిం చారు. నండ్రు రాములు మనుమడు, మనుమరాలు పంచెకట్టు వేడుక, ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొన్నారు. మధిర పట్టణంలో వార్డు కౌన్సిలర్ ముత్తవరల రాణి చనిపోయినందున వారి కుటుంబాన్ని పరామర్శించారు. మర్లపాడులో సీతారామిరెడ్డి వదిన ఇటీవల చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మరికొన్ని ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, జిల్లా నాయకులు బొమ్మెర రామ్మూర్తి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ కోటా రాంబాబు, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, చిదిరాల వెంకటేశ్వరరావు, యన్నం కోటేశ్వరరావు, సర్పంచ్ కనకపూడి పెద్ద బుచ్చయ్య, ఎంపీటీసీ నండ్రు విజయరావు, చావాలి రామరాజు, సొసైటీ ఛైర్మన్ కటికల సీతారామిరెడ్డి, సర్పంచ్ వేమిరెడ్డి పెద్ద నాగిరెడ్డి, సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వరరావు, కపిలవాయి సత్యనారాయణ రాజు, మేడిశెట్టి నాగేశ్వరరావు ఉన్నారు.
బోనకల్ : టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం బోనకల్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రావినూతల గ్రామపంచాయతీ పరిధిలోనే బోనకల్ స్టేషన్కు చెందిన జడిపూడి సైదమ్మ కుమారులు నాగేంద్రకుమార్, ఫణికుమార్లు ఇటీవల ఒకరు రోడ్డు ప్రమాదంలో మరొకరు రైలు ప్రమాదంలో మతి చెందారు. వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. రావినూతలకు చెందిన చేబ్రోలు సీతమ్మ ఇటీవల చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయాలను అందజేశారు. పెద్దబీరవల్లి గ్రామంలో చింతల చెర్వు వీరభద్రం దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలు వేసి నివాళ్లర్పించారు. బ్రాహ్మణపల్లిలో ఇటీవల చనిపోయిన దారగాని ప్రభాకర్, జెర్రిపోతులు ఆనందరావు, డెరాల మంగమ్మ, గాదె వెంకటరెడ్డి కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలకృష్ణారెడ్డిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా అనారోగ్యం బారీ నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పొంగులేటి వెంట రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి, జిల్లా నాయకులు బొమ్మెర రామ్మూర్తి, బోనకల్, జానకిపురం, బ్రాహ్మణపల్లి, రావినూతల, రామాపురం సర్పంచ్లు సైదా నాయక్, చిలకా వెంకటేశ్వర్లు, జెర్రిపోతుల రవీందర్, కొమ్మినేని ఉపేందర్, తొండపు వేణు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లిఖార్జునరావు, ఆ పార్టీ నాయకులు ఉమ్మినేని కష్ణ, గాదె నర్వోత్తమరెడ్డి, తమ్మారపు బ్రహ్మం, సాధినేని రాంబాబు ఉన్నారు.