Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీవెన్స్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌కు కెవిపిఎస్ వినతి
నవతెలంగాణ-ఖమ్మం
దళిత బంధు పైలెట్ మండలమైన చింతకాని మండలంలో కులాంతర పెళ్లిళ్లు చేసుకున్న ఎస్సీలకు దళిత బంధు ఇచ్చి న్యాయం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మంలోని కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో బాధితులతో కలిసి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ స్నేహాలత మొగిలికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే దళిత బంధు అమలుకై పైలెట్ మండలంగా చింతకానిని ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని దళితులందరికి దళిత బంధు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ఎస్సీలను వివాహం చేసుకున్న ప్రతి కుటుంబాన్ని గుర్తించి తక్షణమే వారికి దళిత బంధు ఇచ్చి న్యాయం చేయాలని, ఇప్పటికే అధికారులు గుర్తించిన 43 జంటలకు వెంటనే దళిత బంధు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. దీనితో అసిస్టెంట్ కలెక్టర్ స్పందిస్తూ కులాంతర వివాహిత జంటలకు తప్పకుండా న్యాయం చేస్తామని బాధితులకు హామీనిచ్చారు. కార్యక్రమంలో బాధితులు కె.నరేష్, ఎస్.కె.మీరాసాహెబ్, కొమ్ము సురేష్, నాగులు మీరా, రాము సైదులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.