Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
నవతెలంగాణ-కల్లూరు
బదిలీలు, పదోన్నతుల సాధన కోసం, 317 అప్పిల్స్ పరిష్కారం కోసం యుఎస్పిసి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులను టీఎస్ యుటిఎఫ్ కల్లూరు మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తూ, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని మంగళవారం డిమాండ్ చేసారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవిని, ఖమ్మం జిల్లా అధ్యక్షులు జివి నాగమల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, సురేష్, ఇంకా ఖమ్మం జిల్లా నుంచి పాల్గొన్న ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని కల్లూరు శాఖ అధ్యక్ష, కార్యదర్శులు రాయల నాగేశ్వరరావు, కోడిశెన విజరు కుమార్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ యస్.సతీష్ తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అమర్నాథ్, బి.ఇందుప్రియా, కోశాధికారి వి.శ్రీనివాస్, కార్యదర్శులు బి.రాంబాబు, ఏ.రాజు ఉన్నారు.