Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమ ఫలితంగానే కమిటీ ఏర్పాటు అ టీజీఎస్ రాష్ట్ర నేత ధర్మా
నవతెలంగాణ-కొత్తగూడెం
పోడు పట్టాల కోసం గత రెండేండ్లుగా పట్టుదలతో పట్టాల కోసం చేసిన పోరాటాల ఫలితంగానే సమస్య తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 140ని విడుదల చేసిందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షులు గుగులోత్ ధర్మా పెర్కోన్నారు. మంగళవారం స్థానిక మంచి కంటి భవన్లో జరిగిన పోడు సాగురైతు ప్రతి నిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు పట్టాల కోసం ప్రభుత్వం జివో జారీ చేయడంతో తదుపరి ప్రక్రియ జరగడానికి మార్గం సుగమం అయిందన్నారు. ఈ పోడు పోరులో మహిళల పాత్ర ప్రధానమైనదని గుర్తు చేశారు. సాగు రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించడానికి షెడ్యూలు ప్రకటించాలని ధర్మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తదుపరి జరుగనున్న కార్యచరణ గురించి వివరిస్తు సెప్టెంబర్ నెలలోగా పోడు పట్టాలు జారీ చేసే విధంగా కలెక్టర్ కన్వీనర్‌గా ఏర్పడిన రెవిన్యూ, ఐటీడీఏ, ఫారెస్టుడిపార్ట్ మెంట్స్ సమన్వయంతో సమస్యకు నూరు శాతం న్యాయం చేసే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ కాలంలో చెట్టు పట్టాలు పొందిన భానోత్ జీజాబాయి, బానోత్ ద్వాళీ తదితరులు పాల్గొన్నారు.