Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అర్.వెంకట్రావు
నవతెలంగాణ-మధిర
మండలంలోని పలు గ్రామాల ముఠామేస్త్రిలో కూలీల సమావేశం స్థానిక మార్కెట్ యార్డ్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అర్.వెంకట్రావు మాట్లాడుతూ కూలీల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందని పెరిగిన ధరల వల్ల ఏమి తినలేక కొనలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కూలీల తన సమస్యలపై పోరాటం ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు. అమరవీరుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఏర్పాటు చేసిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కూలీల పక్షాన రాజలేని పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ కూలీలు ముఠా మేస్త్రిలను ఉద్దేశించి ప్రసంగించారు. కూలీలకు 10 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలని, కూలీ బంధు పథకం ద్వారా ప్రతి కూలికి 15వేలు ఇవ్వాలని, మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, చౌక దుకాణాలు ద్వారా ప్రజలకి 16 రకాల నిత్యాసర వస్తువుల అందించాలని, ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇవ్వాలని సమస్యలపై ముఠా మేస్త్రిలో కూలీలు తీర్మానాలను ఆమోదించడం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తెలప్రోలు రాధాకృష్ణ, సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీల నరసింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఓట్ల శంకర్రావు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్, మరియు మహిళా సంఘం నాయకులు మండవ ఫణీంద్ర కుమారి, కార్మిక సంఘం నాయకులు పడకంటి మురళి,చాగంటి వెంకాయమ్మ నాయుడు పాల్గొన్నారు.