Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వంశీకృష్ణ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు గోదావరి ముంపు ప్రజలకోసం ప్రకటించిన రూ.1000 కోట్ల ప్యాకేజీ నుంచి మండలంలో గోదావరి వరద ముంపు గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు యలమంచిలి వంశీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన గోదావరి ముంపు గ్రామమైన సున్నంబట్టిని ఆయన పరిశీలించి, మాట్లాడారు. పోలవరం, సీతారామ ఎత్తిపోతల పధకం, సీతమ్మసాగర్ వంటి నిర్మాణాలవలన గతంలో కంటే వేగంగా వరదలు వస్తున్నాయని దీని వలన దుమ్మగూడెం మండలం తూరుబాక, వైట్ నాగారం, సింగారం, రేగుబల్లి, గంగోలు, కన్నాపురం, కొత్త దుమ్ముగూడెం, వర్క్ షాపు, దుమ్ముగూడెం, సున్నంబట్టి, కాశీనగరం, పర్ణశాల, ఎల్ఎన్ రావు పేట, ముసలిమడుగు ప్రాంతాలు ముంపుకు గురిఅవుతున్నాయని ఆయన అన్నారు. లోతట్టు ప్రాంతాలు చుట్టూ కరకట్ట అలాగే ముంపు, నిర్వాసితులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆయన డిమండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి నలగొర్ల ప్రభాకర్, బంటు మంగరాజు, కొండా క్రిష్ణ, మర్లపాటి పాపారావు, సుబ్బారావు, సందీప్, కళ్యాన్ తదితరులు పాల్గొన్నారు.