Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే పట్టాలు మంజూరు చేయాలి
- సీపీఐ(ఎం0 జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
సీపీఐ(ఎం) పోరాటాల వల్ల తెలంగాణ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వడం కోసం 140జీవో విడుదల చేసిందని జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య తెలిపారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇతర నాయకులు వెళ్లి ముఖ్యమంత్రితో చర్చలు జరిపారని, పోడు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రం అందజేశారని తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి జీవో నెంబర్ 140 విడుదల చేశారని తెలిపారు. కలెక్టర్ వెంటనే పట్టాలు ఇచ్చేవిదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటం ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎజె.రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్, సరియం కోటేశ్వరరావు, భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.