Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల కేంద్రమైన బూర్గంపాడులో జేఏసీ ఆధ్వర్యంలో గత 26 రోజులుగా గోదావరి వరద బాధితులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఈ ప్రభుత్వానికి పట్టదా అని పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందా సంతోష్ కుమార్ విమర్శించారు. మంగళవారం దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం, మద్దతును ప్రకటించి, మాట్లాడారు. 26 రోజులుగా ముంపు బాధితుల రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్నా ప్రభుత్వం స్పందించ కపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే గోదావరి నాలుగు సార్లు 50 అడుగులు దాటి ప్రవహిస్తే ఇక్కడ జీవనం కొనసాగించే ప్రజల పరిస్థితి ఏంటి అని ఆలోచించాలని ఆయన అన్నారు. స్థానిక శాసన సభ్యుడు మొద్దు నిద్ర విడనాడి బాధితుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారు కోరినట్టుగా 2013 భూ చట్టం ప్రకారం సురక్షిత ప్రాంతాలలో నివాస గృహాలు ఏర్పాటు చేసి, మెరుగైన ప్యాకేజీ కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, టీడీపీ మండల అధ్యక్షులు తాళ్లూరి జగదీశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ బూర్గంపాడు మండల ప్రధాన కార్యదర్శి చల్లా వెంకట నారాయణ, బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, మైనార్టీ సెల్ జిల్లా అధ్య క్షులు మొహమ్మద్ ఖాన్, మండల నాయకులు భాగి వెంకట రావు,
పూలపెల్లి సుధాకర్ రెడ్డి, మాడిశెట్టి లక్ష్మణ్ రావు,
ప్రభాకర్ రావు, అబ్దుల్ నయీమ్ పాల్గొన్నారు.