Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా టౌన్
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సభలో గ్రామంలోని అగ్రిగోల్డ్ బాధితులు సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అగ్రిగోల్డ్ బాధితులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలని తమ్మినేని వీరభద్రంకు తెల్దారుపల్లి గ్రామం అగ్రిగోల్డ్ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ముఖ్యమంత్రి కేసిఆర్ దష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరగడానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, తెల్దారుపల్లి గ్రామం అగ్రిగోల్డ్ బాధితులు పరిసబోయిన రమాదేవి, బోల్ల లక్ష్మయ్య, పెండ్యాల సుమతి, ఎస్.కె నుర్జహాన్ పాల్గొన్నారు.