Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
భూమి శిస్తు రూపంలో, వెట్టి చాకిరీతో వ్యవసాయ కూలీలను, చేతి వృత్తుల వారిని పీడించటం విద్యకు, వైద్యానికి దూరం చేయటంతో హింసపడ్డ ప్రజలే ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధ రైతాంగ పోరాటానికి సారదుల య్యారు. ఆనాటి మధిర తాలూకాలో అన్ని గ్రామాలు సాయుధ పోరుకు సైరన్ ఊదినవి. మధిర తాలూకాలో భాగమైన వైరా మండలం కూడా సాయుధ రైతాంగ పోరుకు తన వంతు త్యాగం చేసింది. మండలంలోని ఖానాపురం గ్రామానికి చెందిన వేగుంట జోగయ్య, వేగుంట నారాయణలను ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో ముష్కరులకు పట్టుబడ్డారు. కడలూరు జైలుకు తరలించగా జైలులో జరిగిన పోలీసు కాల్పులకు జోగయ్య ఆహుతయ్యాడు. ఆయన సోదరుడు వేగుంట నారాయణ కడలూరు జైలులో ఉండగానే క్షయ వ్యాధితో బాధపడుతూ మరణించాడు. అదే గ్రామానికి చెందిన కుక్కా వెంకటేశ్వర్లు ఖానాపురం, రెబ్బవరం గ్రామాల మధ్య గడ్డి వామిలో దాగిన విషయం గమనించిన యూనియన్ సైన్యాలు కాల్చి చంపినవి. కొరియర్‌గా ఉన్న తోట పెద్ద గోపయ్య దళ సభ్యుడిగా శిక్షణ పొందుతున్న సమయంలో కుక్కా వెంకటేశ్వర్లు చేతిలో ఉన్న తుపాకీ ప్రమాదవశాత్తూ పెలి గోపయ్య రెండు కాళ్లలో తుపాకీ గుళ్ళు దూసుకెళ్లి గాయపడ్డారు. మండలం లోని వల్లాపురం గ్రామం సాయుధ పోరులో అగ్రభాగాన నిలిచినది. పాలేర్లుగా పనిచేసే గొర్రె ముచ్చు అజరయ్య, మద్ది రాములు తదితరులు బోనకల్ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన చుండూరు నరసింహారావు నాయకత్వంలో దళ సభ్యులుగా పని చేశారు. వీరిని వేర్వేరు ప్రదేశాలలో యూనియన్ సైన్యాలు పట్టుకుని చిత్రహింసలు పెట్టీ రేపల్లేవాడ ఊరి బయట కాల్చి ఛంపినవి.వీరితో పాటు మరో 6 గురిని రైతాంగ పోరాటానికి గుండెకాయలా పనిచేస్తున్న గోవిందాపురం తీసుకు వచ్చి గ్రామ నడిబొడ్డున ఒకే చితిపై కాల్చారు. వల్లాపురం గ్రామం పొరుగునే ఉన్న గోవిందా పురం,లక్ష్మీ పురం, ప్రొద్దుటూరు, పెద్ద బీరవెల్లి, తూటికుంట్ల గ్రామాలలో ఉన్న దళాలకు రక్షణ స్థావరాలు ఏర్పాటు చేసి కాపాడుకునేది. దళాలకు గుత్తా కొండయ్య, నల్లమోతు కోటయ్య, ఇంటి నుండి బోజన ఏర్పాట్లు చేసేవారు. ఆ గ్రామానికి చెందిన బండి నాగయ్య, చెడే నారాయణ, చిన్న అచ్చి వత్సవాయి క్యాంపు దళ సభ్యులు. మాగంటి పుల్లయ్య, యార్రగాని నారాయణ, మద్ది తిరుపతయ్య వీరంతా పోరాటంలో పని చేస్తూ పట్టుబడి జైళ్లకు తరలించబడ్డారు. ఇటీవలి కాలం వరకు పాల్వంచలో ఉంటూ ప్రజాశక్తి దినపత్రిక బాధ్యతలు చూసిన దైవాదీనం ఆ రోజుల్లో కూడా పత్రికలను ఆంధ్రా లోని వత్సవాయి, గార్లపాడు, గోవిందా పురం, ప్రొద్దుటూరు, తూతికుంట్ల క్యాంపులకు చెరవేసేవారు. సిరిపురం ( కనకగిరి) గ్రామంలో సమరసీలురైన రైతులు మచ్చా పట్టయ్య, తాళ్లూరి అప్పారావు లను రజాకారు మూఖలు కాల్చి చంపినవి. ఆంధ్ర మహాసభ కు బలమైన కేంద్రం గా సిరిపురం లో రజాకార్లు అనేక ఇళ్లను తగలబెట్టి,50 పశువులను కిరాతకంగా మంటల్లో నెట్టి కాల్చి చంపారు. పూసాలపాడు గ్రామానికి చెందిన గంగుల ఎల్లయ్య ను కేసుపల్లి అడవుల్లో కాల్చి చంపారు. అదే గ్రామానికి చెందిన వజ్రాల అప్పారావు కొరియరుగా కీలక పాత్ర పోషించారు. గ్రామం లో భూస్వామి భూములను ఆక్రమించి ఎర్ర జెండా లు పాతారు. తన ఇంటిని ఉద్యమ కేంద్రంగా మార్చి ఉద్యమ కారులకు అన్ని వేళలా బోజన వసతులు కల్పించారు. గండగలపాడు గ్రామం ఆంధ్ర మహాసభకు, కమ్యూనిస్టు పార్టీకి బలమైన గ్రామం. గ్రామం లో కాజా రాధా కృష్ణమూర్తి గుడివాడ తాలూకా అయినప్పటికీ 1940 ప్రాంతం లో గండగలపాడు గ్రామం వలస వచ్చి ఇక్కడి భూస్వామ్య,దోపిడీని చూసారు. ప్రవేటుగా బ్రాహ్మల వద్ద 8 వ తరగతి వరకు చిన్న తనం లో చదివిన చదువుతో విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ కామ్రేడ్ బోడేపూడి వెంకటేశ్వరరావుతో పరిచయం ఏర్పడి విప్లవ కార్యక్రమాలలో పాల్గొంటూ, పేదలకు భూములు పంచటం, జాగీర్డార్ల దౌర్జ్యాన్యాలను ఎదిరించడం, వారి నుండి ఆయుధాలు సేకరించటం వంటి కార్యక్రమాలలో ధైర్యంగా పాల్గొంటూ, సాయుధ పోరులో సిద్ధమై చేతి బాంబులు, ఆటోమేటిక్ ఆయుధాలు సేకరించి, కృష్ణా జిల్లా నెమలి గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి సాయుధ దళాలకు శిక్షణ ఇచ్చి 100 మంది దళంతో వీరమాచినేని ప్రసాద్ కమాండర్‌గా 1948 మార్చిలో సాయుధ పోరాటం ప్రారంభించి మొదటి సారి గన్నవరం గ్రామంలో ఉన్న నైజాం మిలటరీ దాడి చేసి వాళ్ళను చిన్నాభిన్నం చేశారు.అదే గ్రామానికి చెందిన గుజ్జా బసవయ్య,అయినాల వెంకయ్య, జోనెబోయిన పెద్ద గోపయ్య, దేవభక్తిని నర్సయ్య, సీతయ్య తదితరులు పోరాటంలో పాల్గొన్నారు. బోడేపూడి వెంకటేశ్వరరావు కొరియర్ గా, కీలక పాత్ర పోషించి అనంతర కాలంలో ఉద్యమ నేత ఎదిగారు. విప్పలమడక గ్రామంలో బలహీన రజక కుటుంబంలో జన్మించిన గరిడేపల్లి వెంకటేశ్వర్లు పేదరికాన్ని అనుభవిస్తూ భూస్వాముల దాష్టీకానికి గురై గ్రామం లో అత్యధిక బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉద్యమ బాట పట్టారు. నిరక్షరాస్యుడైన ఆయన దోపిడీ దౌర్జన్యాలను అధ్యయనం చేస్తూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం లో సాయుధ పోరాట దళాలకు కొరియర్‌గా పనిచేశారు . గొల్లేన పాడు గ్రామానికి చెందిన కొణి దన సీతారామయ్య కమ్యూనిస్టు పార్టీలో దైర్య సాహసాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొంది పాల్వంచ ఏరియా దళ కమిటీ సభ్యులుగా పనిచేశారు ఆయనపై 6 కేసులు నమోదు కాగా వాటిలో 4 హత్య కేసులే. వీరంతా తొలుత రజాకార్ల, భూస్వాముల దోపిడీకి, అదే సమయంలో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పనిచేశారు. ఈ ఉద్యమానికి ఇప్పుడు కొందరు చెబుతున్నట్లు హిందూ ముస్లిం మత విభేదాలు లేవు. నిజాం పాలనలో తాబేదార్లు గా పని చేసిన హిందూవులే ప్రత్యక్ష దోపిడీ దారులన్న విషయాన్ని ఉద్యమ కారులు గుర్తించారు.